బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 జులై 2017 (12:42 IST)

పండ్ల ముక్కలపై ఉప్పు చల్లుకుని తింటున్నారా?

పండ్లను కట్ చేసి తీసుకుంటున్నప్పుడు కాస్త సాల్ట్ చల్లి తింటున్నారా? అయితే ఈ కథనం చదవండి. పండ్ల ముక్కలను నమిలేటప్పుడు కాస్త ఉప్పు చల్లుకుని తింటే.. పండ్ల రుచి పెరుగుతుంది. అయితే ఇలా తినడం ఆరోగ్యానికి మ

పండ్లను కట్ చేసి తీసుకుంటున్నప్పుడు కాస్త సాల్ట్ చల్లి తింటున్నారా? అయితే ఈ కథనం చదవండి. పండ్ల ముక్కలను నమిలేటప్పుడు కాస్త ఉప్పు చల్లుకుని తింటే.. పండ్ల రుచి పెరుగుతుంది. అయితే ఇలా తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది తెలుసుకోవాలా.. అయితే చదవండి. పండ్ల ముక్కలపై లైట్‌గా ఉప్పు చల్లుకుని తినడం ద్వారా అందులో బ్యాక్టీరియాను నశింపజేసుకోవచ్చు. 
 
సిట్రస్ పండ్లలో ఉప్పు చేర్చుకుని తీసుకోవడం ద్వారా ఉదరంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను నిరోధించవచ్చు. అజీర్తి సమస్యలను దూరం చేసుకోవచ్చు. పులుపుతో కూడిన పండ్లలో ఉప్పు చల్లి తీసుకుంటే పులుపు తగ్గి రుచి పెరుగుతుంది. జామకాయల్లాంటి పండ్లకు ఉప్పు చల్లి తీసుకోవడం ద్వారా దంతాలకు మేలు చేస్తుంది. నోటిలోని బ్యాక్టీరియాను కూడా నశింపజేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
పండ్ల ముక్కలపై లైట్‌గా సాల్ట్ చల్లి తీసుకోవడం ద్వారా వాటిని నిల్వ చేయడం ద్వారా ఏర్పడే బ్యాక్టీరియా, షాపుల్లో అమ్మేటప్పుడు వాటిపై చేరే బ్యాక్టీరియాను దూరం చేసుకోవచ్చు. అందుకే పండ్లను శుభ్రంగా కడిగి వాటిపై ఉప్పు చల్లుకుని తినడం మేలే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్థులు ఇలా పండ్లపై ఉప్పు చల్లుకుని తీసుకోకూడదు.
 
పండ్లపై చిటెకెడు మోతాదులో ఉప్పు చేర్చుకుంటే పర్లేదుకానీ.. అదే ఉప్పును స్పూన్ల పరిమాణంలో చేర్చుకుంటే మాత్రం గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.