బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 30 జులై 2017 (13:38 IST)

ఉద్దానం కిడ్నీ సమస్యపై పవన్ కళ్యాణ్ యుద్ధం...

ఉత్తరాంధ్రలోని ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వతపరిష్కారం కోసం జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ యుద్ధం ప్రకటించారు. ఈ సమస్యపై హార్వార్డ్ విశ్వివిద్యాలయానికి వైద్య నిపుణులు ఉద్దానంలో పర్యటించి, సమస్య

ఉత్తరాంధ్రలోని ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వతపరిష్కారం కోసం జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ యుద్ధం ప్రకటించారు. ఈ సమస్యపై హార్వార్డ్ విశ్వివిద్యాలయానికి వైద్య నిపుణులు ఉద్దానంలో పర్యటించి, సమస్యకు గల మూలాలను గుర్తించారు. ఆ తర్వాత ఈ బృందం విశాఖకు చేరుకోగా, వారితో భేటీ అయ్యేందుకు పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం వైజాక్‌కు చేరుకున్నారు. 
 
హైదరాబాద్ నుంచి విశాఖకు ప్రత్యేక విమానంలో వచ్చిన పవన్‌కు అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది. ఆపై అభిమానులతో కలసి పవన్ ర్యాలీగా బయలుదేరారు. ఆ తర్వాత పోతన మల్లయ్యపాలెం సమీపంలోని కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకోనుండగా, ఉద్ధానం సమస్యలపై వైద్యులు, హార్వర్డ్ ప్రొఫెసర్లతో సమావేశమయ్యారు. 
 
వైద్య బృందంతో చర్చల అనంతరం, సోమవారం వారితో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కలవనున్నారు. వారిచ్చే సూచనలను చంద్రబాబుకు తెలిపి, వాటి అమలుకు చర్యలు చేపట్టాలని సూచించనున్నారు.