వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?
రాత్రిపూట స్నానం చేయడం కొందరికి అలవాటు. అయితే రాత్రిపూట స్నానం చేయడం ద్వారా కొన్ని సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటంటే.. రాత్రిపూట స్నానం చేయడం జలుబు, దగ్గు వంటి సమస్యలు ఏర్పడే అవకాశం వుంది.
ఇదే కొనసాగితే అనారోగ్య సమస్యలు తప్పవు. ఇంకా రాత్రిపూట స్నానం చేయడం అజీర్ణ సమస్యలు ఏర్పడే అవకాశం వుంది. దీంతో జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపే ఛాన్సుంది. రాత్రిపూట స్నానం కండరాలకు మంచిది కాదు. దీంతో బరువు పెరిగిపోతారు. రాత్రి పూట స్నానం చేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రత సమతుల్యతలో తేడా ఏర్పడుతుంది. దీంతో నిద్రలేమి సమస్య తప్పదు. మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
అయితే నిజానికి, రాత్రిపూట స్నానం చేయడం వల్ల చర్మంలోని మురికి, దుమ్ము, కాలుష్య కారకాలు తొలగిపోతాయి. అయితే, రాత్రిపూట చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల చలి మరియు అసౌకర్యం కలుగుతాయి. కాబట్టి, రాత్రిపూట గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిది.
ఎండాకాలంలో చల్లని నీటితో స్నానం ఓకే కానీ.. గోరువెచ్చని నీటితో స్నానం రాత్రిపూట చేసే వారికి ఉత్తమం. ఎక్కువ సేపు స్నానం చేయడం కంటే ఐదు నుంచి పది నిమిషాల్లో స్నానాన్ని ముగించేయండి.
ఎండాకాలంలో రాత్రిపూట స్నానం తప్పనిసరి కావడంతో వెచ్చని నీటితో రాత్రిపూట స్నానం కండరాలను సడలించడానికి, ఉద్రిక్తతను తగ్గించడానికి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడుతుంది, తద్వారా నిద్రపోవడం సులభం అవుతుంది. ఎండాకాలంలో అధిక వేడి, చాలా చల్లని నీటితో రాత్రిపూట స్నానం చేయకూడదు.