బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 25 మే 2018 (21:01 IST)

నిరాహార దీక్షకు సిద్ధమైన పవన్ కళ్యాణ్... సీఎం చంద్రబాబు పట్టించుకోలేదనీ...

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలను 48 గంటల్లోపు తేల్చకుంటే నిరాహార దీక్షకు కూర్చుంటానని రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పలాసలో పవన్ ప్రకటించ

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలను 48 గంటల్లోపు తేల్చకుంటే నిరాహార దీక్షకు కూర్చుంటానని రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పలాసలో పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ప్రభుత్వం దీనిపై ఇప్పటివరకూ స్పందించలేదు. దీనితో పవన్ నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి ప్రకటన చేశారు. 
 
కాగా రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ విరామం తీసుకుంటున్నారు. నిరాహార దీక్ష నేపధ్యంలో నిన్నటి నుంచి పవన్ ఘనాహారం తీసుకోవడం మానేసినట్లు మహేందర్ రెడ్డి వెల్లడించారు. పవన్ కళ్యాణ్ రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీకాకుళం పట్టణంలో ప్రజల మధ్య నిరాహార దీక్ష చేస్తారని మహేందర్‌ రెడ్డి పేరిట ప్రకటన విడుదలైంది.