బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 20 జనవరి 2017 (13:43 IST)

పవన్ కళ్యాణ్ #kodipandem పైన టార్గెట్... తెలుగువాళ్ల సంప్రదాయం కోడిపందెం...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జల్లికట్టు నిషేధం పైన మండిపడ్డారు. అలాగే #kodipandem పైన విధించిన నిషేధాన్ని కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్లో ఆయన సుదీర్ఘంగా దీనిపై ట్వీట్లు చేశారు. ఆయన ట్వీట్ల సారాంశం ఏంటంటే... జాతీయ సమైక్యతను కాపాడటానికి ప్ర

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జల్లికట్టు నిషేధం పైన మండిపడ్డారు. అలాగే #kodipandem పైన విధించిన నిషేధాన్ని కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్లో ఆయన సుదీర్ఘంగా దీనిపై ట్వీట్లు చేశారు. ఆయన ట్వీట్ల సారాంశం ఏంటంటే...
 
జాతీయ సమైక్యతను కాపాడటానికి ప్రభుత్వాలు ఆయన ప్రాంతాల ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను కూడా కాపాడాలన్నారు. జనసేన తరపున తను #jallikattu, #kodipandem పైన విధించిన నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రుల సంస్కృతి, సంప్రదాయాల్లో కోడిపందెం కూడా ఒకటి, ఒకవేళ కేంద్రం జీవ హింస పట్ల మరీ తీవ్రంగా పరిశీలన చేయదలిస్తే ముందుగా కోళ్ల పరిశ్రమను నిషేధించాలి. ఎందుకంటే ఏటా 8.4 లక్షల టన్నుల కోడిమాంసం ఉత్పత్తి అవుతుందనీ, మరి కోళ్లను చంపకుండా ఇదంతా ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
 
ఇక జల్లికట్టు గురించి పేర్కొంటూ... దేశ వ్యాప్తంగా ఆయా కబేళాల్లో 2.4 మిలియన్ల టన్నులు పశుమాంసం ఉత్పత్తి అవుతుందనీ, మరి ఇదంతా జీవహింస కాదా అని ప్రశ్నించారు. కేవలం జీవహింస అనేది #jallikattuకి #kodipandem లకే ఎందుకు వర్తింపజేస్తున్నారంటూ ప్రశ్నించారు. కేంద్రం ఉత్తర భారతదేశాన్ని ఒకరకంగానూ, దక్షిణ భారతదేశాన్ని మరో రకంగానూ చూస్తోందంటూ విమర్శించారు. ఇది ద్రవిడ సంస్కృతిపై దాడి అంటూ పేర్కొన్నారు.