మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 జనవరి 2017 (09:55 IST)

ప్రత్యేకహోదాపై పవన్ ట్వీట్.. దేశ్ బచావో పేరిట పోస్టర్.. ప్రతి ఆంధ్రుడు ఓ సైనికుడై కదిలి రావాలి..

ప్రత్యేకహోదాపై ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే తిరగబడతామని ఆంధ్రప్రదేశ్‌ యువత కేంద్రానికి తెలియచెప్పాలని సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదాపై జల్లికట్

ప్రత్యేకహోదాపై ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే తిరగబడతామని ఆంధ్రప్రదేశ్‌ యువత కేంద్రానికి తెలియచెప్పాలని సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదాపై జల్లికట్టు తరహా ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపాడు.

ఈ నెల 26న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ప్రత్యేక హోదా కోసం జరగబోయే నిరసన కార్యక్రమానికి ప్రతి ఆంధ్రుడు ఓ సైనికుడై కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఈ సందర్భంగా, పవన్ కల్యాణ్ 'దేశ్ బచావో' పేరిట ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. వాస్తవానికి ఈ పోస్టర్‌ను ఫిబ్రవరి 5న విడుదల చేయాలనుకున్నారు.

కానీ, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ముందుగానే, అంటే మంగళవారం పవన్ కల్యాణ్ పోస్టర్ విడుదల చేశారు. అవకాశవాద, క్రిమినల్ రాజకీయాలకు ఆల్బం ద్వారా జనసేన తన గొంతుకను వినిపిస్తుందని తెలిపారు. 
 
జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తితో నిరసన కార్యక్రమానికి యువత కదలి రావాలని పవన్ పిలుపునిచ్చారు. జనసేన నిరసనను ఓ మ్యూజికల్ ఆల్బం ద్వారా వ్యక్తం చేస్తామని... ఉద్యమ నినాదాన్ని ఆ ఆల్బం ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతుందని వెల్లడించారు.