శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 11 మే 2017 (16:58 IST)

రాజుగారికి నేనెవరో తెలియకపోవచ్చు.. కానీ ఆయన నాకు బాగా తెలుసు: పవన్

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తర భారతాన్ని తాను వ్యతిరేకించట్లేదని హైదరాబాదులో గురువారం మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. హిందీభాషకు తాను చాలా ప్రాధాన్యత ఇస్తానన్నారు. దేశం ఒక్కటిగా కలిస

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తర భారతాన్ని తాను వ్యతిరేకించట్లేదని హైదరాబాదులో గురువారం మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. హిందీభాషకు తాను చాలా ప్రాధాన్యత ఇస్తానన్నారు. దేశం ఒక్కటిగా కలిసి ఉండాలని కోరుకునే వారు సమస్యలపై గొంతెత్తాలని, దేశ సమగ్రత దెబ్బతినకూడదని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే జనసేన ఉద్దేశమని పవన్ అన్నారు. మిర్చి రైతులను అరెస్ట్ చేయడం చాలా దారుణమని అన్నారు. తాను ఏ పార్టీకి వ్యతిరేకం కాదని.. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే తన కర్తవ్యమని చెప్పారు. 
 
ఇంజినీరింగ్‌ కాలేజీ సమస్యలను విద్యార్థులు తమ దృష్టికి తెచ్చారని, ప్రైవేట్ కాలేజీలు తమను దోచుకుంటున్నాయని విద్యార్థులు తమ గోడు వినిపించుకున్నారని పవన్ చెప్పుకొచ్చారు. ధర్నా చౌక్‌ కోసం జరుగుతున్న పోరాటానికి జనసేన మద్దతునిస్తుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ధర్నా చౌక్‌ను తొలగించే విషయమై తమ్మినేని వీరభద్రం తనను కలిశారన్నారు. శాంతియుతంగా జరిగే ధర్నాలను అడ్డుకోవడం సరికాదన్నారు. ధర్నా చౌక్‌ కోసం జరుగుతున్న పోరాటంలో జనసేన పాల్గొంటుందన్నారు. 
 
ఇకపోతే.. సినీ నటుడు కమ్ పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదంటూ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలపై పవన్ స్పందించారు. తానెవరో అశోక్ గజపతిరాజుకు తెలియకపోవచ్చని... కానీ, ఆయన మాత్రం తనకు బాగా తెలుసని పవన్ నవ్వుతూ చెప్పారు. ఉత్తరాదిపై తనకు ద్వేషం లేదు కానీ, అవకాశాలు అందరికీ సమానంగా ఉండాలనేదే తన అభిమతమన్నారు. దక్షిణాదివారికి కూడా ఉత్తరాదిలో అవకాశాలు ఇవ్వాలని అన్నారు.