శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 మార్చి 2017 (12:15 IST)

నాకు తెలుసు.. ఏపీలో అగ్రిగోల్డ్‌కు 14వేల ఎకరాల భూమి వుంది: పవన్ కల్యాణ్

అగ్రిగోల్డ్ సమస్య ఓ చిక్కుముడి అని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ఇన్ని ఆస్తులుండి కూడా అగ్రిగోల్డ్ బాధితులకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలు ఉన్నా ఎందుకు జాప

అగ్రిగోల్డ్ సమస్య ఓ చిక్కుముడి అని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ఇన్ని ఆస్తులుండి కూడా అగ్రిగోల్డ్ బాధితులకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలు ఉన్నా ఎందుకు జాప్యం చేస్తున్నారని అడిగారు. గురువారం విజయవాడ గేట్ వే హోటల్ వద్ద మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. 2016 నుంచి సమస్య పెరిగిందని చెప్పారు. 
 
ఏపీలో అగ్రీగోల్డ్‌కు 14 వేల ఎకరాల భూమి ఉందని తనకు తెలిసిందని, దీన్ని విక్రయిస్తే, సమస్య ఎంతో సులువుగా పరిష్కారం అవుతుందని చెప్పుకొచ్చారు. బాధితులు ముందు ఆత్మహత్యలు చేసుకోవడాన్ని ఆపాలని పవన్ కోరారు. అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులు ఎక్కడున్నాయో ప్రభుత్వం స్పష్టంగా బాధితులకు పవన్ డిమాండ్ చేశారు. 
 
అయితే అగ్రిగోల్డ్ వ్యవహారంలో తాను స్పందించాలని పలువురు కోరినప్పటికీ, కేసు కోర్టు పరిధిలో ఉండటం, సంస్థ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడం, ఆస్తుల వేలం ప్రక్రియ ప్రారంభం కావడంతోనే బాధితులకు సత్వర న్యాయం జరుగుతోందన్న ఉద్దేశంతో తాను స్పందించలేదని పవన్ అన్నారు. గతంలో సహారా వంటి సంస్థలు కూడా ఇదే తరహా మోసాలు చేస్తే, సుప్రీంకోర్టు కల్పించుకుందని, ఇక్కడ మాత్రం న్యాయం జరగలేదని పవన్ ఆరోపించారు.