1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 23 జులై 2023 (17:22 IST)

చంద్రబాబుతో సమావేశంకానున్న పవన్ కళ్యాణ్?

pawan - babu
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీకానున్నట్టు ఓ వార్త హల్చల్ చేస్తుంది. ఈ సమావేశం హైదరాబాద్ నగరంలోని చంద్రబాబు నివాసంలో జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ భేటీలో ఏపీ రాజకీయాలపై చర్చించే అవకాశం ఉంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇపుడు బాబుతో పవన్ భేటీకానుండటం కీలక పరిణామంగా భావిస్తున్నారు. 
 
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో పవన్ పాల్గొన్నారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలను పవన్ కళ్యాణ్ కలిసి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీకి అత్యధిక ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో చంద్రబాబుతో పవన్ మూడు సార్లు సమావేశమయ్యారు. ఇది విజయవాడలో ఒకసారి, హైదరాబాద్ నగరంలో రెండుసార్లు జరిగింది. 
 
అయితే, ఇపుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ మీటింగ్‌ కీలక కానుంది. ఢిల్లీ పరిణామాలపై ప్రధానంగా ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు, వాలంటీర్ల వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలు, ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ విచారణ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు తదితర అంశాలపై వీరు చర్చించనున్నట్టు తెలుస్తుంది.