సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2023 (13:56 IST)

ఏపీలో ఎన్నికల హీట్.. వారాహి యాత్రకు తోడు హోమం.. పవన్ రెడీ

pawan kalyan
ఏపీలో ఎన్నికల హీట్ మొదలైంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న తరుణంలో అన్నీ పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా జనసేన పార్టీ ఈ నెల 14వ తేదీ నుంచి వారాహి యాత్రను చేపట్టబోతోంది. 
 
తన ప్రచార రథంలో పవన్ ఈ యాత్రను ప్రారంభిస్తారు. ఇంకా ఈ యాత్రకు దైవబలం చేకూరేలా.. హోమం నిర్వహించాలని పవన్ డిసైడ్ అయ్యారు. 
 
ఇందులో భాగంగా ఈ నెల 13వ తేదీన మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో హోమం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. హోమం ఏర్పాట్లను జనసైనికులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.