సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2023 (09:41 IST)

పోరాట యోధుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం : పవన్ కళ్యాణ్

pawan kalyan
ఎంతో పోరాట యోధులు, అమరవీరుల ప్రాణ త్యాగఫలమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ట్వీట్ చేశారు.
 
'తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. పేదరికం లేని తెలంగాణ ఆవిష్కృతం కావాలని.. రైతులు, కార్మికులతోపాటు ఈ నేలపై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆనందమయమైన జీవితం సాగించాలని ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ ఖ్యాతి, కీర్తి అజరామరంగా భాసిల్లాలని కోరుకుంటున్నాను' అని పవన్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.