శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2016 (10:42 IST)

నోట్ల రద్దు కష్టాలు: మోడీ మారు వేషంలో వచ్చి.. ఇడ్లీతిని.. టీతాగి చూడాలి.. కష్టమేమిటో

ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి పూర్వం రాజులు మారు వేషాల్లో వెళ్లినట్లే.. ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా బయటకు వెళ్లి ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన ఓ బ్యాంక్ ఖాతాదారుడు

ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి పూర్వం రాజులు మారు వేషాల్లో వెళ్లినట్లే.. ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా బయటకు వెళ్లి ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన ఓ బ్యాంక్ ఖాతాదారుడు డిమాండ్ చేశాడు. బ్యాంక్ క్యూలో ఉదయం నుంచి కొన్ని గంటలపాటు నిలబడితే తనకు 5 వేల రూపాయలు ఇచ్చారని.. మరికొంత మంది ఖాతాదారులకు ఆమాత్రం దక్కలేదని సదరు ఖాతాదారుడు తెలిపారు. 
 
కొత్త నోటు రూ.2 వేల రూపాయలకు చిల్లర దొరకడం లేదని.. బ్యాంకుల్లో సరిపడా నగదు ఇవ్వట్లేదంటూ బ్యాంకు ఖాతాదారులు వాపోతున్నారు. ఒక న్యూస్ ఛానెల్ తో సదరు ఖాతాదారుడు మాట్లాడుతూ.. మోడీ ప్రధాన మంత్రి హోదాలో కాకుండా.. మారువేషంలో ఓ సామాన్యుడిగా.. హోటల్‌కు వెళ్లి ఇడ్లీ తిని, ప్రధాన హోదాలో కాకుండా బిల్లు చెల్లించేందుకు రెండు వేల రూపాయల నోటు ఇవ్వాలని చెప్పాడు. అప్పుడు మోడీకి చిల్లర ఇస్తారో లేదో చెప్పాలంటూ సదరు ఖాతా ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశాడు.