ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 సెప్టెంబరు 2020 (06:19 IST)

దుర్గ‌మ్మ‌కు ముత్యాల‌హారం బ‌హుక‌ర‌ణ‌

ఇంద్ర‌కీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు కృష్ణా జిల్లా ఉయ్యూరు, కెనాల్ రోడ్డు ప్రాంతానికి చెందిన అన్నే శ్రీనివాస్‌బాబు అమ్మ‌వారికి అలంకరణ నిమిత్తం సుమారు 105 గ్రాముల బరువు గల బంగారు ముత్యాల హారాన్ని బ‌హుక‌రించారు.

ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్‌బాబుని కలిసి హారాన్ని అంద‌జేశారు. హారం నందు 1 రాళ్ళ లాకెట్, 85 తెలుపు రాళ్ళు, 42 పెద్ద ముత్యాలు, 3 ఎరుపు రాళ్ళు మరియు 14 ఎరుపు పూసలు ఉన్న‌ట్లు దాత తెలిపారు.

ఈ సంద‌ర్భంగా దాత కుటుంబ‌స‌భ్యుల‌కు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించి, అమ్మవారి  శేషవస్త్రము, చిత్రపటం, మరియు ప్రసాదాలు అందజేశారు.