మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 23 నవంబరు 2020 (22:41 IST)

ప్రజలు ప్రభుత్వ పాఠశాలలను వెతుక్కుంటూ వెళ్తున్నారు: రోజా

ప్రైవేటు పాఠశాలలపైనే ఎక్కువగా తల్లిదండ్రులు దృష్టి పెడుతుంటారు. కాయకష్టమో చేసుకుని తమ పిల్లలను బాగా చదివించాలనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు కాలం మారింది. మీలో మార్పు వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలపైన మీకు నమ్మకం పెరిగింది. నాకు చాలా సంతోషంగా ఉందన్నారు రోజా.
 
ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదవాలంటే సిగ్గుపడేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలను వెతుక్కుంటూ వెళుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు ఎంత నమ్మకం పెరిగిందో దీన్నిబట్టి మనకు అర్థమవుతోంది. 
 
ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు అదే స్థాయిలో ఉన్నాయి. కరోనాపై జాగ్రత్త వహిస్తూ ఈ రోజు 8వతరగతి విద్యార్థులకు పాఠశాలలు కూడా జరుగుతున్నాయి. దానికంతటికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు రోజా. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో కరోనాపై అప్రమత్తం చేస్తూ వినూత్నంగా విద్యార్థులకు హెర్బలైరా టీజర్ గొడుగులను రోజా అందజేశారు. వీటిని వాడటం వల్ల కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చన్నారు రోజా.