శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (06:05 IST)

'వాడెమ్మ మొగుడు మంత్రి' అంటేనే గుర్తుపడుతున్నారు: కొడాలి నానిపై పిల్లి మాణిక్యరావు ఫైర్

జగన్మోహన్ రెడ్డి తాను చేస్తున్న దుర్మార్గాలను, అరాచకాలను సమర్థించుకోవడానికి భాషచేతగాని, పనికిమాలిన, బూతుల మంత్రులను అడ్డం పెట్టుకుంటున్నాడని, వారితో నోటికొచ్చినట్లు మాట్లాడించడం ఆయనకు పరిపాటిగా మారిందని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు.

ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.  మంత్రి కొడాలి నాని అంటే ప్రజలెవరికీ అర్థంకావడం లేదని, బూతులమంత్రి, సన్నాసి మంత్రి, నీయమ్మ మొగుడు మంత్రి అంటేనే వారు గుర్తిస్తున్నారన్నారు.

రమేశ్ ఆసుపత్రి గురంచి ప్రేలాపనలు చేస్తున్న సన్నబియ్యం సన్నాసి మంత్రి తన శాఖను ఎవరికో అప్పగించి, నోటితో బతికేస్తున్నాడని మాణిక్య రావు ఎద్దేవాచేశారు. జగన్ తన అవినీతి, దోపిడీ, తన పాదప్రభావంతో జరిగే చర్యలను ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించిన ప్రతిసారీ బూతుల మంత్రి నోరు తెరుస్తున్నాడన్నారు.

ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగినప్పుడు, సదరుకంపెనీ ప్రతినిధులతో కలిసిపోయి, వారితో కుమ్మైక్కై మాట్లాడిన ముఖ్యమంత్రి, స్వర్ణప్యాలెస్ దుర్ఘటన విషయంలో మాత్రం తప్పంతా రమేశ్ ఆసుపత్రిదే అన్నట్లుగా వ్యవహరించడం ముమ్మాటికీ కమ్మకులంపై ద్వేషంతోనేనని టీడీపీనేత తేల్చిచెప్పారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు లేక, మందులు దొరక్క, సకాలంలో వైద్యం అందక అనేకప్రాణాలు పోయినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోని ముఖ్యమంత్రి, రమేశ్ ఆసుపత్రి విషయంలో మాత్రం ఎందుకంత అత్యుత్సాహం చూపుతున్నాడో సమాధానం చెప్పాలన్నారు.

ముఖ్యమంత్రికి, బూతులమంత్రికి కులాలపేరు చెప్పి, మాట్లాడ టానికి సిగ్గుగా లేదా అని మాణిక్యరావు ప్రశ్నించారు. జగన్ తనకు తాయిలాలు, మంత్రి పదవి, డబ్బులిస్తున్నంత మాత్రాన సిగ్గులేకుండా నాని తనకులాన్ని తానే కించపరుచుకోవడం ఏమిట న్నారు. చదువులేని తనకు మంత్ర పదవే మహాగొప్ప అని నాని భావిస్తున్నాడన్నారు.

కర్నూల్లో ఎస్పీవై ఆగ్రోస్ ప్రమాదం జరిగినప్పుడు, రాంకీసెజ్ లో దుర్ఘటన జరిగినప్పుడు నాని ఎందుకు నోరెత్తలేదన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలప్రకారం నోరు తెరిచే కొడాలినాని తననోరు  అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు. ఈ ప్రభుత్వంలో  అనేక హత్యలు, అత్యాచారాలు, ప్రమాదాలు, దళితులపై దాడులు జరిగినప్పుడు బూతులమంత్రి ఎక్కడున్నారన్నారు?

రాజధాని అంటే రాజ్యాంగవ్యవస్థల సమూహమని, అవన్నీ ఒకచోట ఉండేదానినే రాజధాని అంటారని సన్నాసి మంత్రి తెలుసుకోవాలన్నారు. అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు, కంపెనీలు, ప్రాజెక్టులు తీసుకురావాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలివ్వాలని, అలాకాకుండా పరిపాలనా వికేంద్రీకరణకు, అభివృద్ధివికేంద్రీకరణకు తేడా తెలుసుకోకుండా మంత్రి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

కొడాలినానికి తనశాఖపై పట్టుంటే, ముందు సన్నబియ్యం సంగతేమిటో చెప్పాలన్నారు.  టీడీపీలో ఉన్నప్పుడు అమరావతి నిర్మాణాన్ని స్వాగతించిన డొక్కా మాణిక్యవరప్రసాద్ , పార్టీ మారగానే మాట మార్చడం, రాజధాని గురించి మాట్లాడేహక్కు దళితులకు లేదు అన్నట్లుగా ఆయన మాట్లాడటం దారుణమని మాణిక్యరావు ఆగ్రహం వ్యక్తంచేశారు.

తన పదవులగురించి, తన ప్రయోజనాల గురించి డొక్కా వైసీపీ వారితో మాట్లాడుకుంటే, తమకు అభ్యంతరాలు లేవని, అలాకాకుండా దళితుల గురించి, రాజధాని గురించి ఆయన మాట్లాడితే సహించేది లేదన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం శుభపరిణామనని, అది అన్నిప్రాంతాలకు సమానదూరంలో ఉందని, బుద్ధుడు నడయాడిన ప్రాంతమని కీర్తించినడొక్కా, ఇప్పుడెందుకు మతిచలించి మాట్లాడుతున్నాడో చెప్పాలన్నారు.

పార్టీ మారిన ప్రతిసారి, మాటమార్చడం డొక్కాకు అలవాటుగా మారిందన్న మాణిక్యరావు, వైసీపీలోకి వెళ్లి, ఎమ్మెల్సీ కాగానే, రాజధాని ప్రాంతంలోని రైతులు, దళితులుగురించి మాట్లాడటం హస్యాస్పదంగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ను అవమానించేలా డొక్కా మాట్లాడడన్నారు.

దళుతులు రాజధాని గురించి మాట్లాడకూడదు అనడం కంటే అట్రాసిటీ ఏముంటుందో వరప్రసాద్ చెప్పాలన్నారు. దళితులు రాజధాని గురించి ఎందుకు మాట్లాడకూడదో, వారికెందుకు ఆస్వేఛ్చ లేదో డొక్కా చెప్పాలన్నారు. దళిత ప్రతినిధి నని చెప్పుకుంటూ, దళితులను అవమానించేలా మాట్లాడటం ఏమిటన్నారు.

అమరావతిలో ఇళ్లస్థలాలివ్వడాన్ని తాము తప్పపట్టలేదన్న మాణిక్యరావు, రాజధాని ప్రాంతంలోని వారినిక కాదని, ఎక్కడెక్కడి వారినో తీసుకొచ్చి, దళితులు, దళితేతరుల మధ్య గొడవలు పెట్టేచర్యలను మాత్రమే తాము అడ్డుకున్నా మన్నారు. తూర్పుగోదావరిలో దళితయువకుడికి శిరోముండనం చేసినప్పుడు, దళితడాక్టర్ ని చేతులుకట్టేసి ఈడ్చుకెళ్లినప్పుడు, దళితవైద్యురాలిపై అసభ్యంగా ప్రవర్తించినప్పుడు డొక్కా ఎందుకు నోరుతెరవలేదన్నారు.

దళితుల మధ్య చిచ్చుపెట్టే చర్యలను డొక్కా మానుకోవాలని, పార్టీ కండువాలు మార్చిన ప్రతిసారి, అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడటం ఎంతమాత్రం మంచిది కాదని మాణిక్యరావు స్పష్టంచేశారు.