శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 మే 2024 (16:49 IST)

ఏపీ హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్!!

pinnelni
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. ఇందులోభాగంగా మాచర్ల జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని ధ్వంసం చేసిన కేసులో మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, అధికార వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో పిన్నెల్లిని అరెస్టు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన గురువారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌లో దాఖలు చేశారు. మరోవైపు, పిన్నెల్లి ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెల్సిందే. ఆయన కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. 
 
పులిరా.. పులిరా... పెద్ద పులిరా... ఈవీఎంలు పగలగొట్టి పారిపోయేరా...!! పిన్నెల్లిపై ట్రోల్స్ 
 
మాచర్ల జిల్లా పాల్వాయిగుంట కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ప్రధాన నిందితుడైన వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ట్రోల్ పేలుతున్నాయి. ఈ నెల 13వ తేదీన ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగింది. ఆ రోజున వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే, అభ్యర్థి ఈవీఎంలు పగలగొట్టి, హింసకు దిగి ఆ తర్వాత పరారైపోయారు. ఇపుడు ఆయనను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ పేలుతున్నాయి. 
 
'నేను నేరుగా చెబుతున్నాను.. నాకు మాచర్లకు రావాలంటే 2 గంటలు అన్నోడు 2 కార్లు మార్చి ఎందుకు పారిపోయాడు..?' అని ఎద్దేవా చేస్తున్నారు. 'పులిరా.. పులిరా పెద్ద పులిరా... ఈవీఎంలు పగలగొట్టి పారిపోయేరా..' అని వ్యంగాస్త్రాలు విసురుతున్నారు. 'జూన్ 4 వరకు ఎలా కాలక్షేపం అవుతుందా అనుకున్నాం. తస్సాదియ్యా ఏం కథ మొదలు పెట్టిర్రుపో' అంటూ పిన్నెల్లి ఎపిసోడ్లపై జోకులు వేసుకుంటున్నారు. కొన్ని మీమ్స్ రాష్ట్ర పరిస్థితులనూ వివరిస్తూ పిన్నెల్లిపై చురకలు వేస్తున్నారు.
 
2 గంటల్లో వచ్చేవాడే కానీ, రోడ్లు బాలేక ఆలస్యమై ఉంటుంది! మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి మంచివాడు అని సీఎం జగన్ చెబితే ఏమో అనుకున్నాం. కానీ, మరీ ఈవీఎంలు పగలగొట్టేంత మంచివాడనుకోలేదు. ఇంత బతుకు బతికి బాత్రూం కమోడ్లు తయారు చేసే కంపెనీలో దాక్కోవడమేంట్రా బుజ్జీ. ఏలేవాడు మనోడైతే ఎన్నేషాలైనా వేయొచ్చు. ఇప్పుడే ఇలావుంటే ఫలితాలు వచ్చాక ఇంకెన్ని వెబ్ సిరీస్లు విడుదల అవుతాయో! అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.