గురువారం, 20 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 13 మే 2024 (20:07 IST)

ప్రధాని మోదీ నామినేషన్: సతీసమేతంగా వారణాసికి పవన్ కల్యాణ్

pawan kalyan
కర్టెసి-ట్విట్టర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీసమేతంగా వారణాసికి చేరుకున్నారు. ప్రధాని మోడీ రేపు వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. మీడియాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఇలా చెప్పారు.
 
‘‘ఎన్‌డీఏకు భారీ విజయం చేకూరబోతోంది. నా శుభాకాంక్షలను, మద్దతును తెలియజేయడానికి ప్రధాని మోడీ పక్కన ఉండటం గౌరవంగా భావిస్తున్నాను. ప్రధాని మోడీ మరోసారి ప్రధాని కాబోతున్నారు.''