శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (18:51 IST)

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

Ashok Galla  Varanasi Manasa
Ashok Galla Varanasi Manasa
'హీరో' చిత్రంతో సక్సెస్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ప్రస్తుతం గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో 'దేవకీ నందన వాసుదేవ'చేస్తున్నారు. హనుమాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.
 
గతంలో కథానాయకుడి పాత్రను పరిచయం చేసిన టీజర్‌  సినిమా ప్రిమైజ్ ని ప్రజెంట్ చేసింది. టీజర్ కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ చేశారు మేకర్స్. ఫస్ట్ సింగిల్ ఏమయ్యిందే ప్రోమోను విడుదల చేశారు. ఇటీవలి కాలంలో అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఆకట్టుకునే బీట్‌లతో అద్భుతమైన పాటని అందించారు.
 
 ఈ పాట అశోక్ గల్లా తన లవ్ వారణాసి మానస పట్ల ఆరాధనని చూపుతుంది. ఈ పాటలో అశోక్ గల్లా ఆనందంగా కనిపించగా, వారణాసి మానస అందంగా ఉంది. వీరి జోడి తెరపై ఆకర్షణీయంగా కనిపించింది. పూర్తి సాంగ్ మే3 న విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
 
గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్‌తో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల డీవోపీగా పని చేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్.