సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 జులై 2024 (19:41 IST)

వరద ప్రాంతాల్లో ప్రజల రక్షణకై తిరుగుతున్న జనసేన ఎమ్మెల్యేలు (video)

MLA Balaraju
MLA Balaraju
భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. భద్రాద్రి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పెద్దవాగులో భారీగా నీరు చేరింది. దీంతో బచ్చువారిగూడెం-నారాయణపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 
 
వాగుకు గండిపడడంతో గుమ్మడవల్లి-కొత్తూరు గ్రామాలు నీట మునిగాయి. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు, కూలీలు దాదాపు 25 మంది చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్ సాయంతో వారిని రక్షించి గమ్యస్థానాలకు చేర్చారు. 
 
Janasena MLAs
అలాగే వరదలో చిక్కుకున్న వారిని రక్షించడానికి అధికార యంత్రాంగంతో కలిసి స్వయంగా రంగంలోకి దిగిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. వరదలో చిక్కుకున్న గ్రామ ప్రజలందరని సురక్షిత ప్రాంతాలకి అధికారులు తరలించారు.
ఈ సందర్భంగా వరద ప్రాంతాల్లో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తూ.. వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు.