బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 మే 2023 (09:19 IST)

ఆ ఈ-మెయిల్ బూటకం..తిరుమలలో ఉగ్ర సంచారం లేదు.. టీటీడీ

tirumala
సుప్రసిద్ధ క్షేత్రం, కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పుణ్యక్షేత్రానికి ఉగ్రమూకలతో బెదిరింపులు ఎదురయ్యాయి. ఇ-మెయిల్ రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. మెయిల్ ద్వారా ఉగ్రవాద ముప్పు వుందని బెదిరింపులు వచ్చాయని.. అయితే ఇది కొంతమంది పోకిరీల బూటకమని పోలీసులు ధృవీకరించారు. 
 
ఈ ఘటనపై తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో ఉగ్రవాదుల సంచారం లేదని భక్తులకు భరోసా ఇచ్చారు. ఇ-మెయిల్ పంపిన వారిని గుర్తించడానికి విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు. 
 
తిరుమలలో ముందస్తు జాగ్రత్త చర్యగా టీటీడీ, పోలీసులు తనిఖీలు చేపట్టారు. భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, తిరుమలలో హై-అలర్ట్‌ లేదని ఎస్పీ హామీ ఇచ్చారు.