శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2017 (12:32 IST)

మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకుంటూ అడ్డంగా దొరికిన ఏఎస్ఐ

జోగులాంబ గద్వాల జిల్లాలో మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకుంటూ ఏఎస్ఐ హసన్ అడ్డంగా దొరికిపోయారు. మహిళలకు రక్షణకు కల్పించాల్సిన పోలీసులే మహిళా పోలీసులతో ఇలాంటి పనులు చేయించడం ఇప్పుడు తీవ్

జోగులాంబ గద్వాల జిల్లాలో మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకుంటూ ఏఎస్ఐ హసన్ అడ్డంగా దొరికిపోయారు. మహిళలకు రక్షణకు కల్పించాల్సిన పోలీసులే మహిళా పోలీసులతో ఇలాంటి పనులు చేయించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 
గత కొన్నాళ్లుగా ఏఎస్ఐ వేధింపులకు పాల్పడుతుండటంతో అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాలని సీక్రెట్ కెమేరాలు అమర్చారు. అలవాటుచొప్పున హసన్ తనకు మసాజ్ చేయించుకుంటూ కెమేరాకు చిక్కాడు. ఇప్పుడీ వీడియో నెట్లో హల్చల్ చేస్తోంది. కాగా ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. 
 
సంబంధిత వ్యవహారంపై విచారణ చేసి నివేదిక పంపాలని ఆయన చెప్పినట్లు సమాచారం. హైదరాబాదులో కూడా ఓ మహిళా కానిస్టేబుల్ పైన వేధింపులు, ఇంటి పనులు చేయించుకున్న వైనం ఇటీవల వెలుగుచూసిన సంగతి తెలిసిందే.