శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2017 (12:32 IST)

తెలంగాణాలో వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే తరహా సౌకర్యాన్ని కల్పించిన విషయంతెల్సిందే. ఈనేపథ్యంలో తెలంగాణ రాష్ట్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే తరహా సౌకర్యాన్ని కల్పించిన విషయంతెల్సిందే. ఈనేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. 
 
రవాణా, రవాణేతర డ్రైవర్లు, వర్కింగ్ జర్నలిస్టులు, హోంగార్డులకు ఉచిత ప్రమాదబీమా కల్పిస్తున్నట్లు ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి వెల్లడించారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు పైవిధంగా సమాధానమిచ్చారు. 
 
2015 నుంచి ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. సామాజిక భద్రతలో భాగంగా రూ.5 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నట్లు చెప్పారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇప్పటివరకు చనిపోయిన డ్రైవర్లు, జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసినట్టు తెలిపారు.