గోడపై మూత్రం పోసినవాడు గాడిద... మరి ఆ పోలీసు అధికారి ఏం పని చేశాడో తెలుసా?
సాధారణంగా రోడ్డు పక్కన మలమూత్ర విసర్జన చేయొద్దనీ, గోడపై మూత్ర పోయొద్దంటూ గోడలపై మున్సిపాలిటీ సిబ్బంది రాతలు రాస్తుంటారు. కానీ, ఇవేమీ మాకు పట్టవు అన్నట్టుగా కొందరు నిరక్షరాస్యులు తమ పనుల్లో తాము నిమగ్న
సాధారణంగా రోడ్డు పక్కన మలమూత్ర విసర్జన చేయొద్దనీ, గోడపై మూత్ర పోయొద్దంటూ గోడలపై మున్సిపాలిటీ సిబ్బంది రాతలు రాస్తుంటారు. కానీ, ఇవేమీ మాకు పట్టవు అన్నట్టుగా కొందరు నిరక్షరాస్యులు తమ పనుల్లో తాము నిమగ్నమైపోతుంటారు.
అయితే, విద్యావంతుడైవుండి, బాధ్యత కలిగిన ఉద్యోగం చేస్తున్న ఓ పోలీసు.. మనిషి ఏం చేశాడో తెలుసా? రోడ్డు పక్కన పోలీస్ వాహనాన్ని నిలిపి, తీరిగ్గా మూత్ర విసర్జన కానిచ్చేశాడు. ఈ పోలీస్ వ్యవహారాన్ని ఎవరో ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టారు.
ఇంకేముంది, నెట్‌లో ఇదో పెద్ద వైరల్ అయ్యింది. ఆ పోలీసెవరో తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రోడ్డు పక్కన టాయ్‌లెట్స్ ఏర్పాటు చేసింది. వాటి వినియోగం ఎంత మాత్రం ఉందో ఈ ఫోటో చూసే చెప్పొచ్చు.