గురువారం, 30 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2025 (11:44 IST)

Pothuluri: మొంథా తుఫాను- కూలిపోయిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం.. అరిష్టమా? (video)

Pothuluri Veerabrahmendra swamy
Pothuluri Veerabrahmendra swamy
మొంథా తుఫాను కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. భవనాలు కుప్పకూలిపోయాయి. పంటలు మునిగిపోయాయి. ఈ క్రమంలో కడపలో సైతం భారీ వర్షాలకు జగద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాస గృహం కుప్పకూలిపోయింది. 
 
బ్రహ్మంగారి నివాస గృహాన్ని కాపాడాల్సిన అధికారులు అలసత్వం వహించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఠాధిపతి కోసం పోటీ పడుతున్న వారసులు సైతం నివాస గృహాన్ని కాపాడుకునేందుకు ఏమాత్రం ప్రయత్నం చెయ్యలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. బ్రహ్మంగారి నివాస గృహం కూలిపోవడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మఠం అభివృద్ధి చేస్తున్నామని అధికారులు గొప్పలు చెప్పారని, అధికారుల అలసత్వం కారణంగా నివాస గృహం కూలిందని భక్తులు  మండిపడుతున్నారు. చారిత్రక నేపథ్యం వున్న నివాస గృహం కూలిపోవడం సరికాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.