బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2017 (11:00 IST)

ప్రేమ పేరుతో గర్భం చేశాడు... ఆపరేషన్ వికటించి ప్రియురాలి మృతి.. ఎక్కడ?

ప్రేమ పేరుతో ఓ యువతిని గర్భవతిని చేసిన ఓ యువకుడు... ఆ గర్భాన్ని ఎవరికీ తెలియకుండా తీయించేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆపరేషన్ వికటించి ఆ యువతి కన్నుమూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

ప్రేమ పేరుతో ఓ యువతిని గర్భవతిని చేసిన ఓ యువకుడు... ఆ గర్భాన్ని ఎవరికీ తెలియకుండా తీయించేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆపరేషన్ వికటించి ఆ యువతి కన్నుమూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
హైదరాబాద్, వనస్థలిపురానికి చెందిన మధు, హారిక అనే యువతీయువకులు ప్రేమించుకున్నారు. అయితే, వీరి ప్రేమ పెళ్లికి ముందే హద్దులుదాటింది. ఫలితంగా హారిక గర్భందాల్చింది. ఈ విషయం ఇంట్లోని పెద్దలకు తెలియకుండా ఉండేందుకు మధు ఓ ప్లాన్ వేశాడు. తనకు తెలిసిన ఓ వైద్యురాలిని సంప్రదించి హారిక గర్భాన్ని తొలగించాలని ప్రాధేయపడ్డాడు. 
 
ఇందుకోసం స్థానికంగా స్థానిక అనూష నర్సింగ్‌ హెమ్‌లో చేర్పించాడు. అక్కడ గర్భం తొలగిచడం వికటించడంతో హారిక మృతి చెందింది. దీంతో ప్రియుడు మధు, డాక్టర్‌ గిరిజారాణిని పోలీసులు అరెస్టు చేశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.