శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (13:21 IST)

అధిక బరువు వల్లే పీఎస్ఎల్వీ రాకెట్ విఫలం : డైరెక్టర్ శివకుమార్

ఇటీవల భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సి-39 ప్రయోగం విఫలం కావడానికి రాకెట్ అధిక బరువేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇదే విషయంపై డైరెక్టర్ శివకుమార్ స్పందిస్తూ... 'ఐఆర్‌ఎన్‌ఎ

ఇటీవల భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సి-39 ప్రయోగం విఫలం కావడానికి రాకెట్ అధిక బరువేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇదే విషయంపై డైరెక్టర్ శివకుమార్ స్పందిస్తూ... 'ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్ -1హెచ్‌' ఉపగ్రహ ప్రయోగం విఫలం కావడంపై ఆయన వివరణ ఇచ్చారు. అధిక బరువు కారణంగా ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టే క్రమంలో పీఎస్‌ఎల్వీ నిర్ణీత వేగంతో ప్రయాణించలేకపోయిందని అన్నారు. 
 
సుమారు టన్ను బరువు పెరిగిందని ఆయన తెలిపారు. ఈ రాకెట్ గరిష్టంగా 20,650 కిలోమీటర్ల దూరంలోని అపోజీ కక్ష్యలోకి దూసుకెళ్లాల్సి ఉండగా, అధిక బరువు కారణంగా కేవలం ఆరు వేల కిలో మీటర్ల దూరం మాత్రమే వెళ్లగలిగిందని ఆయన తెలిపారు. రాకెట్లోని అన్ని దశల ఇంజన్లు సక్రమంగానే పని చేశాయని, కానీ చివరి దశలో ఉష్ణకవచం మాత్రం వేరుపడలేదని ఆయన వివరించారు.