1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (11:07 IST)

శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబు సిద్ధం... ఉత్తర కొరియా ప్రకటన

ప్రపంచ దేశాల హెచ్చరికలను ఉత్తర కొరియా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా, అగ్రరాజ్యం అమెరికాకు ముచ్చెమటలు పోయించే చర్యలకు దిగుతోంది. తాజాగా ఉత్తర కొరియా చేసిన ప్రకటన పెంటగాన్‌ను మరింత ఆందోళనకు గురిచేసేల

ప్రపంచ దేశాల హెచ్చరికలను ఉత్తర కొరియా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా, అగ్రరాజ్యం అమెరికాకు ముచ్చెమటలు పోయించే చర్యలకు దిగుతోంది. తాజాగా ఉత్తర కొరియా చేసిన ప్రకటన పెంటగాన్‌ను మరింత ఆందోళనకు గురిచేసేలా ఉంది. 
 
అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్‌ బాంబును అభివృద్ధి చేశామని ఉత్తర కొరియా ప్రకటించింది. జపాన్ మీదుగా ప్రయాణించి, ఫసిఫిక్ తీర దిశగా ప్రయోగించిన ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం) హస్వాంగ్‌-14 కు అమర్చేందుకు వీలుగా దీనిని తయారు చేశామని తెలిపింది. 
 
ఈ (ఐసీబీఎంకి హైడ్రోజన్‌ బాంబును అమర్చే) ప్రయోగానికి కిమ్‌ జాంగ్‌ ఉన్ ఎప్పుడో ఆదేశాలు జారీ చేశారని ఈ ప్రకటన వెల్లడించింది. దీంతో హైడ్రోజన్‌ బాంబును ఎంత మోతాదులో కావాలంటే అంత మోతాదు (10 టన్నుల నుంచి 100 టన్నుల వరకూ)లో క్షిపణికి అమర్చి ప్రయోగించొచ్చని స్పష్టం చేసింది.
 
ఉత్తరకొరియాపై సైనిక చర్యకు దిగుతామంటూ హెచ్చరిస్తున్న అమెరికాకు ఈ ప్రకటన ఆందోళనలకు గురిచేసేలా ఉంది. ఈ హైడ్రోజన్‌ బాంబు తయారీలో ఉపయోగించిన గుండుసూది కూడా ఉత్తరకొరియా దేశీయంగా అభివృద్ధి చేసిందేనని స్పష్టం చేసింది. దీంతో ఎన్ని కావాలంటే అన్ని హైడ్రోజన్ బాంబులను తయారు చేసుకోవచ్చని తెలిపింది. తాజా ప్రకటన నేపథ్యంలో ఈ మూడు దేశాల్లో ఆందోళన వ్యక్తమయ్యే అవకాశం ఉంది.