బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2017 (10:58 IST)

ఉత్తర కొరియా చేతిలో రసాయన ఆయుధాలు : ఐరాస నివేదిక

'పిచ్చోడి చేతిలో రాయి' అన్న చందంగా ఉత్తర కొరియా చేతిలో రసాయన ఆయుధాలు ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి నివేదికలో వెల్లడైంది. ఈ నివేదికను చూసిన అమెరికా హడలిపోతోంది. మొత్తం 37 పేజీలతో కూడిన నివేదికను ఐరాస విడుదల

'పిచ్చోడి చేతిలో రాయి' అన్న చందంగా ఉత్తర కొరియా చేతిలో రసాయన ఆయుధాలు ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి నివేదికలో వెల్లడైంది. ఈ నివేదికను చూసిన అమెరికా హడలిపోతోంది. మొత్తం 37 పేజీలతో కూడిన నివేదికను ఐరాస విడుదల చేయగా, అది అమెరికా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. 
 
ఇంతకీ ఈ నివేదికలో ఏముందంటే... ఉత్తర కొరియా రసాయన ఆయుధాలను తయారు చేస్తోంది. ఉత్తర కొరియా ఎగుమతులపై ఐక్యరాజ్యసమితి అంక్షలు విధించిన అనంతరం సిరియా నుంచి ఆ దేశం రెండు పడవల్లో రసాయన దాడులకు అవసరమైన సామాగ్రిని దిగుమతి చేసుకుందని ఐక్యరాజ్యసమితి అంతరంగిక భద్రతా మండలి తన నివేదికలో వెల్లడించింది. 
 
సిరియా నుంచి ఈ రసాయనాలను ఉత్తర కొరియా మైనింగ్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ పేరుతో తెప్పించుకుందని ఐరాస నివేదికలో పేర్కొంది. నిజానికి ఈ సంస్థ లావాదేవీలను 2009లోనే ఐక్యరాజ్యసమితి నిషేధించింది. కానీ, ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తూ సిరియా రసాయన ఆయుధాలను తయారు చేసి, ఐసిస్ తీవ్రవాదులపై ప్రయోగించింది. అవి సాధారణ ప్రజలపై ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఇపుడు అలాంటి ఆయుధాలే ఉత్తర కొరియా చేతిలో ఐరాస నివేదిక బహిర్గతం చేసింది.