సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 14 జులై 2019 (10:51 IST)

లవ్లీ యూనివర్శిటీలో తెలుగు విద్యార్థి సూసైడ్

పంజాబ్ రాష్ట్రంలోని లవ్లీ విశ్వవిద్యాలయంలో ఓ తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని అనంతపురం జిల్లా వాసిగా గుర్తించారు. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో ఈ వర్శిటీ ఉండగా, ఇందులో భరత్ బీటెక్ చదువుతూ వచ్చాడు. ఈ క్రమంలో హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
నికంగా ఈ ఘటన విద్యార్థుల్లో కలకలాన్ని రేపింది. యూనివర్సిటీ యాజమాన్యం భరత్‌ కుటుంబానికి ఆత్మహత్యపై సమాచారం అందించింది. అయితే భరత్‌ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఇతని సొంతూరు అనంతపురం జిల్లా గుడిపాడు గ్రామం. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.