సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 13 జులై 2019 (13:40 IST)

మాజీ భర్తను వదులుకోలేదు.. రెండో భర్తతో సంసారం.. చివరికి ఏమైందంటే?

మాజీ భర్తతో లైంగిక సంబంధాన్ని కొనసాగించిన భార్యను భర్త హత్య చేసిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. ముందుగానే వివాహమైందనే విషయాన్ని దాచిపెట్టి.. మాజీ భర్తతో లైంగిక సంబంధాన్ని కొనసాగిస్తూ.. రెండో భర్తతోనూ కాపురం చేసిన మహిళకు తగిన శాస్తి జరిగింది. కట్టుకున్న భార్య తనకు పెళ్లైందనే విషయాన్ని దాచిపెట్టిన విషయాన్ని తెలుసుకుని షాక్ అయ్యాడు. అంతే భార్యను హత్య చేశాడు.
 
వివరాల్లోకి వెళితే.. పంజాబ్, లూధియానా ప్రాంతానికి చెందిన గురుచరణ్‌కు.. సురీంద్రకు రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. అయితే ఇటీవల రెండు నెలల పాటు భార్య ప్రవర్తనలో తేడాను గమనించాడు భర్త. ఆపై భార్య గురించి కూపీ లాగాడు. ఆ సమయంలో తన భార్యకు ముందే పెళ్లైందని తెలుసుకుని షాకయ్యాడు. అంతేగాకుండా ఆమెకు ఇద్దరు పిల్లలు వున్నారని కూడా తెలిసింది. 
 
దీని గురించి ఆమెను ప్రశ్నిస్తే.. నిజం ఒప్పుకుంది. కానీ మాజీ భర్తకు దూరమయ్యానని చెప్పింది. కానీ ఆమె మాటల్లో నిజం లేదని.. భర్తతో శారీరక సంబంధాన్ని కొనసాగిస్తుందని తెలుసుకుని షాకయ్యాడు. అంతేగాకుండా విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. 
 
తనను మోసం చేసిందనే ప్రతీకారంతో విడాకుల కోసం వెళ్లిన పోలీస్ స్టేషన్‌కు బయటే ఆమెపై దాడి చేసి హతమార్చాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురును అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.