ముందే తెలిస్తే నా పెళ్లికి లోన్ తీసుకునేదాన్ని...
రాధ- బ్యాంక్ నుండి లోన్ తీసుకుని స్కూటర్ కొనుక్కున్నా, వాయిదాలు కట్టకపోయేసరికి స్కూటర్ తీసుకుని వెళ్లిపోయారు.
మంజు- అరె అవునా.... ఇదేదో కాస్త ముందు తెలిస్తే బాగుండేదే... నా పెళ్లికి లోన్ తీసుకునేదాన్ని.
2.
టీచర్- ఒరేయ్ రవి.... దేశాన్ని పరిపాలించిన రాజుల్లో ప్రజలకు సుఖసంతోషాలను కలిగించిన ఇద్దరి రాజుల పేర్లు చెప్పు.
రవి- సుఖసంతోషాలు ఇచ్చిన రాజులా సార్..... చేప్తాన్ సార్.... ఒకరు స్మో..కింగ్, ఇంకొకరు డ్రిం...కింగ్... సార్.