సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 10 జులై 2019 (22:46 IST)

ప్లాస్టిక్ మేం తెచ్చుకుంటే ఎంతవుతుంది డాక్టర్

భార్య- ఏవండీ... చేపల కూర చేసాను తినండి...
భర్త- వద్దులేవే ముళ్లుంటాయి....
భార్య- పర్వాలేదండీ చెప్పులేసుకుని తినండి.
 
2.
పేషెంట్- డాక్టర్ గారూ.. ప్లాస్టిక్ సర్జరీకి ఎంతవుతుంది...
డాక్టర్- యాబై వేలు...
పేషెంట్- ప్లాస్టిక్ మేం తెచ్చుకుంటే ఎంతవుతుంది డాక్టర్.
డాక్టర్- కోపంతో... లక్ష అవుతుంది కరిగించి అతికించాలి కదా.
 
3.
టీచర్- నందూ... కోడిపుంజు గురించి రెండు వాక్యాలు చెప్పు.
నందూ- కూస్తే అలారం... కోస్తే ఫలహారం.