ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 1 జులై 2019 (19:38 IST)

ఆ ఖైదీ సంజీవని కోసం వెళ్లి ఇంతవరకూ తిరిగి రాలేదు

జైలర్- ఇది చాలా మంచి విషయమే కదా... ఎందుకు భయపడుతున్నావు.
కానిస్టేబుల్- ఎందుకంటే సర్, హనుమంతుడి పాత్ర వేసిన ఖైదీ సంజీవని కోసం వెళ్లి ఇంతవరకూ తిరిగి రాలేదు.
 
2.
భార్య- ఏవండీ... ఫోన్ చేసి కంగారుగా మాట్లాడుతున్నారేంటి... ఇంతకీ ఎక్కడున్నారు?
భర్త- నేను కారులో ఉన్నా... కారు స్టీరింగు, క్లచ్, యాక్సలరేటర్ అన్నీ దొంగలెత్తుకుపోయారు. మరి ఇప్పుడు నన్నేం చేయమంటావు?
భార్య- మందు తాగారా.....
భర్త- కొద్దిగా తీసుకున్నా.... అయినా నేను కారు గురించి మాట్లాడుతుంటే నువ్వు మందు గురించి మాట్లాడతావేంటి?
భార్య- ముందు నువ్వు కారు వెనుక సీట్లో నుండి ముందు సీట్లోకి రండి.... అప్పుడు అన్నీ కనిపిస్తాయి.