ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ : దొంగ ఓట్లతో కింగ్ కాంగ్‌ను గెలిపించాడు...

pvp vara prasad
Last Updated: మంగళవారం, 23 జులై 2019 (09:30 IST)
లోక్‌సభ స్థానం నుంచి వైకాపా తరపున పోటీ చేసి ఓడిపోయిన నేత పీవీపీ వరప్రసాద్. ఈయనకు, లోక్‌సభ సిట్టింగ్ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నానికి మధ్య ట్వీట్ల వార్ సాగుతోంది. పీవీపీపై కేశినేని చేసిన తొలుత చేసిన ఓ ట్వీట్ చేశారు. దీనిపై ఘాటుగా స్పందించిన పీవీపీ వరుస ట్వీట్లతో కలకలం రేపుతున్నారు.

తాజాగా బ్రేకింగ్ న్యూస్ పేరిట మరో ట్వీట్ చేసారు. ఓ నియోజకవర్గంలో 10 వేల దొంగ ఓట్లు వేయించిన ఓ ప్రబుద్ధుడు మన కింగ్ కాంగ్‌ను దొడ్డి దారిలో గెలిపించాడని ఆరోపించారు. పీవీపీ తాజాగా చేసిన ట్వీట్ ఇదే.

"బ్రేకింగ్ న్యూస్...!
మన కింగ్ కాంగ్‌కి ప్రబుద్ధుడు ఒక నియోజకవర్గంలో 10వేల దొంగ ఓట్లు వేయించి, దొడ్డి దారిలో గెలిపించాడు. ఇప్పుడు old habits die hard! ప్రబుద్దుడు సర్వీస్ చార్జెస్‌కి పేమెంట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చాడు కింగ్ కాంగ్. అందుకే ఈ కొబ్బరి చిప్పలు, కాల్ మనీ గొడవలు" అంటూ పేర్కొన్నారు.దీనిపై మరింత చదవండి :