గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 జులై 2021 (10:24 IST)

జగన్‌కు రఘురామ మరో లేఖాస్త్రం

ఏపీ సీఎం జగన్‌కు ఆంగ్ల మాధ్యమంలో బోధనపై ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న మీ నిర్ణయం.. ప్రతి తెలుగువాడి గుండెల్లో ముల్లులా గుచ్చుకుంటోందన్నారు.

పాఠశాలల్లో అవసరమైన యంత్రాంగం ఉందో.. లేదో ఆలోచించారా? అని రఘురామ ప్రశ్నించారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో తెలుగును కనీసం.. ద్వితీయ భాషగా పెడుతున్నట్లు కూడా స్పష్టం చేయలేదన్నారు. మీ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమనే చాలా మంది వ్యతిరేకిస్తున్నారన్నారు.

ఇప్పటికైనా తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలుసుకోవాలన్నారు. పసి మనసులను మాతృభాష నుంచి దూరం చేయకండన్నారు.

ఇప్పటికైనా తెలుగు భాషను చిదిమేయాలనే మంకుపట్టుతో వేసిన.. వ్యాజ్యాలను ఉపసంహరించుకోవాలని రఘురామ కోరారు.జాతీయ విద్యా విధానాన్ని తూచా తప్పకుండా అనుసరించి.. మీ గౌరవం, రాష్ట్ర గౌరవాన్ని పెంచాలని లేఖలో ఎంపీ రఘురామ కోరారు.