బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 జులై 2021 (09:01 IST)

మ‌హిళ‌లు ఇక‌పై గ్రామ‌, వార్డు స‌చివాల‌య‌ల్లోనే ఫిర్యాదులు చేయాలి: జగన్

''గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులను యాక్టివ్‌గా చేయాలి, ఫిర్యాదు చేయడానికి మహిళలు పీఎస్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలి, గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకే ఫిర్యాదు చేసేలా చూడాల‌ని, జీరో ఎఫ్‌ఐఆర్ అవకాశాన్ని విస్తృతంగా కల్పించాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

దిశ యాప్‌పై మహిళా పోలీసులకు అవగాహన, శిక్షణ కల్పించాల‌న్నారు. ప్రతి 2 వారాలకోసారి కలెక్టర్, ఎస్పీలు ప్రజా సమస్యలతో పాటు.. మహిళల భద్రతపైనా సమీక్ష నిర్వహించాలి.  పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్‌ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. దిశ ఎలా పనిచేస్తుందన్న దానిపై ప్రతి పీఎస్‌లో డిస్‌ప్లే ఏర్పాటు చేయాల‌ని తెలిపారు.

గంజాయి రవాణా, సరఫరాపై ఉక్కుపాదం మోపాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం, పోలీసులపై దుష్ప్రచారం చేస్తున్న ఘటనల్లో నిజాలను ప్రజల ముందుంచాలన్నారు. బాధితులను ఆదుకునే విషయంలో ఆలస్యం జరగకూడదని తెలిపారు.

దిశ బిల్లులకు ఇప్పటివరకు రాష్ట్రపతి ఆమోదం తెలుపని అంశాన్ని వివరిస్తూ జగన్ కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. దిశ బిల్లులను రాష్ట్రపతి వెంటనే ఆమోదించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.