శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (10:38 IST)

మహిళలపై నేరాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలి: డిజిపి గౌతమ్ సవాంగ్

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ఐపిఎస్ గారు ఎపి హెడ్ క్వార్టర్ మంగళగిరి  నుండి అన్ని రేంజ్ డీఐజీ లు, జిల్లాల ఎస్పీలు, డీఎస్పీ లు, ఇన్స్పెక్టర్ లు,  సబ్‌ఇనస్పెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
 
ఈ విడియో కాన్ఫరెన్సుకు కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు హజరయ్యారు. రాష్ట్ర డిజిపి గారు మాట్లాడుతూ…. ఎక్కడైతే  మహిళలపై నేరాలు జరిగే అవకాశం ఉంటుందో ఆ ప్రాంతాలను గుర్తించాలన్నారు. 
 
మహిళా పోలీసులు, మహిళ మిత్ర , గ్రామ, వార్డు సంరక్షణ కార్యదర్శులు సమన్వయంతో  గస్తీలు నిర్వహించాలన్నారు. కళాశాలల  వద్ద రాత్రి వేళల్లో ఎవ్వరు  ఉండకుండా చూసుకునే విధంగా ముందస్తుగా  నోటిసులు ఇవ్వాలన్నారు.
  
ఆపదలో ఉన్న మహిళలు, మైనర్ బాలికల సంరక్షణ, భధ్రత కొరకు దిశ యాప్ గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. యాండ్రాయిడ్ ఫోన్ కలిగి ఉన్న ప్రతి ఒక్క మహిళతో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయించాలన్నారు. దిశా యాప్ ద్వారా వచ్చే ప్రతి సమస్య పట్ల సత్వరమే స్పందించాలన్నారు.
 
నిమిషాల వ్యవధిలోనే బాధితులకు పోలీసుల సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ  విడియో కాన్ఫరెన్సు లో సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి ఐపియస్ గారు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ ఎమ్. కె రాధాక్రిష్ణ, మరియు ఆయా సబ్ డివిజన్ ల నుండి డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.