ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 19 మే 2021 (16:37 IST)

మా ప్రాణాలను కాపాడండి: గుంటూరులో గర్భిణీ స్త్రీల ఆవేదన

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లోని గైనిక్ వార్డులో ప్రసవానికి వచ్చిన గర్భిణీ స్త్రీలు నరకాన్ని చూస్తున్నారు. ప్రసవానికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ చేస్తామని చెప్పి దుస్తులు వేసి నిన్న మధ్యాహ్నం నుంచి ఆపరేషన్ థియేటర్లో పడుకోబెట్టి ఇప్పటివరకు పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితి.

రక్తం ఎక్కించాలి అని చెప్పి రక్తం తెప్పించి రెండు రోజులు గడుస్తున్నా ఎటువంటి వైద్యం అందించగా పోవడంతో రక్తం కూడా పాడైపోయింది. వార్డులో విధులు నిర్వహించే వైద్య సిబ్బంది నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ గర్భిణులను పట్టించుకోకపోవడంతో ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని భయంతో అటు గర్భిణీ స్త్రీలు ఇటు వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎవరికి చెప్పాలో తెలియక వారిలో వారు మథనపడుతూ ఆసుపత్రి వైద్యుల ధోరణి కి వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా  ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి గారు పట్టించుకొని తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు తమ దీనస్థితిని వ్యక్తపరుస్తున్నారు.