మధ్యాహ్నం 12 గంటల తర్వాత తెలంగాణ వాహనాలను రానివ్వం: గుంటూరు రూరల్ ఎస్పీ

telangana rtc
ఎం| Last Modified బుధవారం, 5 మే 2021 (17:24 IST)
రాష్ట్ర వ్యాప్తంగా అమలుకానున్న కర్ఫ్యూ ని పకడ్బందీగా అమలుచేస్తామని కర్ఫ్యూ సమయంలో ఇతర రాష్ట్రాల వాహనాలను రానివ్వమని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.

కోవిడ్ విజృంభన కట్టడి చేసేందుకు బుధవారం నుంచి మధ్యాహ్నం 12.00 గంటల తర్వాత పొందుగుల చెక్ పోస్ట్ వద్ద తెలంగాణా రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలను అనుమతించమని గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో మధ్యాహ్నం 12.00గంటల వరకు మాత్రమే జన సంచారానికి అనుమతి ఉందని, కర్ఫ్యూలో మినహాయింపు ఉన్నవారు తప్పనిసరిగా గుర్తింపు కార్డ్ దగ్గర ఉంచుకుని పోలీస్ వారికి సహకరించాలని ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇదిలావుంటే ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వుంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.దీనిపై మరింత చదవండి :