1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (12:35 IST)

లాక్ డౌన్ ఉల్లంఘనలకు కఠిన చర్యలు: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి

తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ పటిష్టంగా అమలు అవుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య దృష్ట్యా లాక్ డౌన్ ను కొనసాగిస్తుందని, కరోనా వైరస్ చైన్ బ్రేక్ చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ప్రజలందరూ తమకు సహకరించాలని అనవసరంగా రోడ్లపైకి రావద్దు అని సూచించారు.

డీజీపీ. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్స్ తో పాటు హైదరాబాద్ లో జన సాంద్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కఠినంగా పోలీసులు లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. మూడు కమిషనరేట్ పరిధిలో పోలీసులు పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారని అనవసరంగా రోడ్లపైకి వస్తున్నా వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తున్నట్లు మహేందర్ రెడ్డి  తెలియజేసారు.

అంబులెన్సులు, ఎసెన్షియల్  వెహికల్స్, డాక్టర్స్, పారామెడికల్ సిబ్బంది , వ్యాక్సినేషన్ కి వెళ్లే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.