గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 7 జులై 2021 (09:39 IST)

దిశా డిఐజిగా రాజకుమారి

విజయనగరం జిల్లా ఎస్పీగా పనిచేసిన బి.రాజకుమారి దిశా డిఐజిగా పదోన్నతి లభించింది. డిజిపి కార్యాలయంలో అడ్మిన్‌ డిఐజి గానూ రాజకుమారికి అదనపు బాధ్యతలను అప్పగించారు.

విజయనగరం జిల్లా ఎస్పీ గా బి.రాజకుమారి ఇటీవలే రెండు ఏళ్ళు పూర్తిచేసుకున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది ఆమెకు డిఐజి పదోన్నతి లభించింది. అప్పటి నుండి ఆమె పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. 

విజయనగరం జిల్లా నూతన ఎస్పీ గా ఎం.దీపికా పాటిల్‌ ని అధికారులు నియమించారు. దీపక పాటిల్‌ గతంలో విజయనగరం జిల్లా పార్వతీపురం సబ్‌ డివిజన్‌ అడిషనల్‌ ఎస్పీ గా సేవలందించారు.

జిల్లాలో పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. ప్రస్తుతం ఆమె అమరావతి డిజిపి కార్యాలయంలో దిశా స్పెషల్‌ ఆఫీసర్‌ గా పనిచేస్తున్నారు.