1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (13:01 IST)

తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల భాగస్వామ్యం : డిఐజి రంగనాధ్

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పోలీస్ శాఖ అన్ని స్థాయిలలో కీలక భాగస్వామ్యం వహిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని డిఐజి ఏ.వి. రంగనాధ్ అన్నారు.
 
బుధవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో డిఐజి ఏ.వి. రంగనాధ్, జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ నర్మద, ఏ.ఆర్. విభాగంలో ఏ.ఆర్. డిఎస్పీ సురేష్ కుమార్ తో పాటు జిల్లాలోని అన్ని డిఎస్పీ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో పోలీస్ అధికారులు జాతీయ పతాకవిష్కరణ చేసి గౌరవ వందనం సమర్పించారు.
 
ఈ సందర్బంగా డిఐజి రంగనాధ్ మాట్లాడుతూ ఎంతోమంది ఉద్యమకారుల పోరాటాలు, అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితంగా నేటి తెలంగాణ ఏర్పాటు జరిగిందని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ అభివృద్ధిలో పోలీస్ శాఖ అన్ని స్థాయిలలో నిరంతరం  భాగస్వామ్యం అవుతూ శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఇది ఎంతో గర్వకారణమన్నారు.

రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల స్ఫూర్తితో ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం జిల్లాలోని అన్ని స్థాయిల పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించే సమయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా డబుల్ మాస్కులు ధరించడం, సానిటైజర్ వినియోగిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు.
 
కార్యక్రమంలో డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, రమణా రెడ్డి, రవీందర్, డిపిఓ ఏ.ఓ. మంజు భార్గవి, సూపరింటెండెంట్లు అతిఖుర్ రెహమాన్, దయాకర్, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య, సిఐలు రౌతు గోపి, నిగిడాల సురేష్, చంద్ర శేఖర్ రెడ్డి, ఆర్.ఐ.లు స్పర్జన్ రాజ్, నర్సింహా చారి, శ్రీనివాస్, కృష్ణా రావు, నర్సింహా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.