బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (12:32 IST)

తెలంగాణ ప్రభుత్వ బడుల్లో ఆన్‌లైన్‌ క్లాసులు

ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులకు మార్గాలు అన్వేషిస్తున్నామని  తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

వచ్చే విద్యా సంవత్సరానికి దీనికి ఓ పరిష్కారం లభిస్తుందన్నారు. ఆన్‌లైన్‌ తరగతులపై ఆదివారం సునీత అనే ఉపాధ్యాయురాలు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.

దీనిపై స్పందించిన మంత్రి.. ప్రభుత్వ బడుల్లో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై పరిశీలించాలని విద్యాశాఖ మంత్రికి సూచించారు. కేటీఆర్‌ సూచనపై స్పందించిన సబితాఇంద్రారెడ్డి ఈమేరకు ట్వీట్‌ చేశారు.