గదికి పిలిచి విద్యార్థినిపై అత్యాచారం చేసిన హాస్టల్ మేనేజర్...
కంటికి రెప్పలా కాపాడాల్సిన హాస్టల్ మేనేజర్.. కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. తన గదికి పిలిచి ఈ దారుణానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోటలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
కంటికి రెప్పలా కాపాడాల్సిన హాస్టల్ మేనేజర్.. కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. తన గదికి పిలిచి ఈ దారుణానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోటలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల ఓ అమ్మాయి కోట నగరంలోని ఇందిరావిహార్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రముఖ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈమె కాలేజీ హాస్టల్‌లో ఉంటూవస్తోంది. ఈ క్రమంలో కాలేజీ హాస్టల్ మేనేజరుగా పనిచేస్తున్న ప్రదీప్ కుమార్ సుమన్ (30) ఆ యువతిపై కన్నేశాడు.
ఒక విషయంపై చర్చించేందుకు తన గదికి పిలవడంతో ఆ విద్యార్థిని రాగా, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన కోర్కె తీర్చకుంటా ఇతర విద్యార్థినులకు కూడా చెపుతానని బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో విసిగిపోయిన కళాశాల విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడైన ప్రదీప్ కుమార్ సుమన్‌పై ఐపీసీ సెక్షన్ 376, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.