గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (12:27 IST)

ఎన్నో సార్లు చెప్పాను.. ఐదేళ్ల పాటు ఆ మహా పాపం జరిగిపోయింది.. రమణ దీక్షితులు

ramana deekshithulu
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై టీటీడీ శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు ఏవి రమణ దీక్షితులు సంచలన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రసాదాలపై అనేక ఫిర్యాదులు చేశానన్నారు. 
 
ప్రసాదాలు నాణ్యత లేదని, దిట్టం సరైన పద్ధతితో చేయడం లేదని, రుచిలో కూడా మార్పు వచ్చిందని అప్పటి ఈవో, చైర్మన్ల దృష్టికి తీసుకెళ్లామన్నారు. కానీ తన ఫిర్యాదులు కనీసం పట్టించుకోలేదన్నారు. 
 
గత ఐదేళ్ల పాలనలో నాసిరకం అన్న ప్రసాదం, నివేదించారన్నారు. సిఎంగా చంద్రబాబు అధికారం చేపట్టగానే టీటీడీలో ప్రక్షాళన చేపట్టారన్నారు. నాణ్యతపై లోపాలు ఎత్తి చూపినందుకు తనను గత ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిందన్నారు. 
 
అధికారులు కూడా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారన్నారు. ప్రభుత్వ కేసుల వల్ల ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చిందన్నారు. ప్రశ్నించినందుకే తనను అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలోతో భక్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారన్నారు. అన్నం పెట్టే దేవుడికి సూచిగా, రుచిగా నివేదనలు పెట్టాలన్నారు. నైవేద్యంలో కల్తీ జరగడం బాధాకరమన్నారు. స్వామి వారికీ సరైన రీతిలో నివేదనలు జరగడం లేదన్నారు. 
 
గత ఐదేళ్ళలో ప్రసాదాల నాణ్యత గురించి అప్పటి ఈవో‌కు, చైర్మన్‌కు అనేక సార్లు చెప్పానని, అయితే మిగతా అర్చకులు తనతో కలిసి రాకపోవడంతో ఆ మహా పాపం ఐదేళ్ల పాటు జరిగిపోయిందని తెలిపారు.