సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 24 డిశెంబరు 2021 (13:20 IST)

విశాఖ స‌ముద్ర తీరాన అతి పెద్ద చేప వేల్ షార్క్!

ప్రపంచంలోనే అతి పెద్ద చేపగా గుర్తించబడిన వేల్‌ షార్క్‌ విశాఖ తీరానికి వచ్చింది. ఇక్కడి తంతడి బీచ్‌లో స్థానిక మత్స్యకారుల వలకు చిక్కింది. 50 అడుగుల పొడవు, 2 టన్నుల బరువు ఉండే చేప ఒడ్డుకు రావడాన్ని గమనించిన వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీకాంత్‌ మన్నెపూరి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని తెలియజేశారు.
 
 
విశాఖ డీఎఫ్‌వో అనంత్‌శంకర్‌ ఆదేశాల మేరకు సిబ్బంది వెంటనే తంతడి బీచ్‌కు చేరుకొని ప్రపంచంలోనే అతిపెద్ద చేప అయిన వేల్‌షార్క్‌గా దీనిని నిర్ధారించారు. అంతరించిపోతున్న షార్క్‌ల జాతిలో ఇదొకటిగా గుర్తించారు. షార్క్‌ను సురక్షితంగా సముద్రంలోకి పంపించే ఏర్పాట్లు చేయాలని డీఎఫ్‌వో అనంత్‌శంకర్‌ సూచించారు. వెంటనే అటవీ శాఖ సిబ్బంది, మత్స్యకారులు, వన్యప్రాణుల సంరక్షకులు షార్క్‌కు ఫిల్టర్‌ ఫీడింగ్‌ ఇచ్చారు. అనంతరం షార్క్‌ను సురక్షితంగా సముద్రంలోకి పంపించారు. ఇలాంటి వేల్ షార్క్ లు చాలా అరుదు అని, వాటిని పెంచి పోషించాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంద‌ని అట‌వీశాఖాధికారులు తెలిపారు.