గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2021 (13:41 IST)

కరోనా నుంచి కోలుకున్నా: రేణుదేశాయ్

ప్రముఖ నటి రేణుదేశాయ్ కరోనాబారిన పడినట్లు... చికిత్స ద్వారా కోలుకున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించారు.

కరోనా సోకడంతో తాను కొన్నిరోజులు ఇంటికే పరిమితమయ్యారని.. షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చారని.. ఇప్పుడిప్పుడే మరలా తాను షూటింగ్‌లకు వెళుతున్నట్లు సోషల్‌ మీడియాలో టచ్‌లోకి వచ్చిన అభిమానులకు తెలిపారు.

అలాగే ఆమె నటించిన వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ కూడా పూర్తయిందని.. దానికి సంబంధించిన వివరాలు త్వరలోనే చెబుతామన్నారు.

ఇక ఓ క్రేజీ ప్రాజెక్టుకి కూడా ఓకే చెప్పినట్లు...వీటితోపాటు రైతుల మీద తీసే సినిమా మార్చిలో సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు తెలిపారు.