శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 21 జనవరి 2021 (17:07 IST)

త్వరలో రేపల్లె-సికింద్రాబాద్ డెల్టా ఎక్స్‌ప్రెస్ పునరుద్ధరణ

రేపల్లె నుండి రాకపోకలు సాగించే కాచిగూడ-రేపల్లె-సికింద్రాబాద్ (డెల్టా) ఎక్స్‌ప్రెస్ రైలు సహా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే 27 ప్రధాన రైళ్లను పునరుద్ధరించడానికి రైల్వేబోర్డు అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపారు. అందులో డెల్టా ఎక్స్‌ప్రెస్ సహా 24 రైళ్లను ప్రత్యేక రైళ్లుగా నడపడానికి రైల్వేబోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆమోదముద్ర వేశారు.
 
సమయపట్టిక, ఇతర సాంకేతిక అంశాల ఖరారు అనంతరం పూర్తి వివరాలను సంబంధిత అధికారులు త్వరలో ప్రకటించనున్నారు. ఈ నెలాఖరు లోగా ఈ రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ 24 రైళ్లలో, గుంటూరు జిల్లా మీదుగా రాకపోకలు సాగించనున్న రైళ్ల వివరాలు ఈ విధంగా ఉండనున్నాయి.
 
గుంటూరు-రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్
విజయవాడ-ధర్మవరం-విజయవాడ (వయా-నంద్యాల) ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ (వయా-గుంటూరు) ఏసి దురంతో ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్-గుంటూరు-సికింద్రాబాద్ (వయా-కాజీపేట) ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
కాకినాడ-రేణిగుంట-కాకినాడ ఎక్స్‌ప్రెస్
తిరుపతి-ఆదిలాబాద్-తిరుపతి (కృష్ణా) ఎక్స్‌ప్రెస్
తిరుపతి-పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్
తిరుపతి-బిలాస్ పూర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్
కాకినాడ-బెంగుళూరు-కాకినాడ (శేషాద్రి) ఎక్స్‌ప్రెస్