శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 21 జనవరి 2021 (15:44 IST)

గరుడ ఆర్టీసీ బస్సులో పత్రికా విలేఖరి, బ్యాగులో రూ.50 లక్షలు, ఎక్కడివి?

కృష్ణా జిల్లా: కంచికచర్ల మండలం దొనబండ సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద పోలీసు వాహనాలు తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ వెళ్లే గరుడ ఆర్టీసీ బస్సును తనిఖీ చేయగా ఒక వ్యక్తి వద్ద 50 లక్షల రూపాయల నగదు పట్టుబడింది.
 
ఈ నగదును స్వాధీనం చేసుకున్నామని ఆ డబ్బుకి సరైన అనుమతి పత్రాలు లేనందు వల్ల వాటిని సీజ్ చేసి ఇన్‌కమ్ టాక్స్ అధికారులకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. కాగా ఈ వ్యక్తి వైజాగ్ నుండి హైదరాబాదు  వెళ్తున్నాడని, వైజాగ్‌లో ఇతను ఒక పత్రికా విలేఖరి అని తమ విచారణలో తెలిసినట్లు సీఐ సతీష్ తెలిపారు.