చిత్తూరుజిల్లాలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు
చిత్తూరు జిల్లాలో కరోనా కేసులతోపాటుగా బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 135 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి.
తిరుపతి రుయా ఆసుపత్రిలో 67, స్విమ్స్ లో 70 కేసులను అధికారులు నిర్ధారించారు. బ్లాక్ ఫంగస్‌తో ఇప్పటి వరకు జిల్లాలో ఇద్దరు మఅతి చెందారు. బ్లాక్ ఫంగస్ కు మందుల కొరత తీవ్రంగా ఉండటంతో రోగులకు అరకొరగా వైద్యం అందుతుంది.
చిత్తూరుజిల్లాలో మంగళ, బుధవారాల నడుమ 24 గంటల వ్యవధిలో 1551 కరోనా కేసులు నమోదు కాగా వైరస్ బారినపడి రాష్ట్రంలోనే అత్యధికంగా 15మంది మృతి చెందారు.
కొత్తగా గుర్తించిన కేసులతో కేసుల సంఖ్య 194176కు చేరుకోగా మరణాల సంఖ్య 1325కు పెరిగింది. మరోవైపు జిల్లాలో 17706 యాక్టివ్ పాజిటివ్ కేసులున్నట్టు ప్రభుత్వ బులెటిన్ పేర్కొంది.